ట్రాన్స్ జెండర్స్ ఔదార్యం..నిర్మల్ లో చలివేంద్రం ఏర్పాటు..

by Sumithra |
ట్రాన్స్ జెండర్స్ ఔదార్యం..నిర్మల్ లో చలివేంద్రం ఏర్పాటు..
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : వారు ట్రాన్స్ జెండర్స్ అయితేనేమి వారికి మంచి మనసే ఉంది తీవ్రమైన ఎండలతో తల్లడిల్లే వారికి తమ వంతు సాయంగా ఉండాలని కోరుకున్నారు. వారే స్వయంగా డబ్బులు పోగేసుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. నిర్మల్ పట్టణ సీఐ మల్లేష్ చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించారు. దారిన వెళ్లే వారికి ఎండ వేడిమి నుంచి దాహార్తి తీరుస్తున్నారు. ట్రాన్స్ జెండర్స్ ను సమాజంలో అవహేళన చేయకుండా వారిని కూడా అన్ని వర్గాలు సమబావలతో చూడాలని సిఐ మల్లేష్ సూచించారు. వారు చేస్తున్న సామాజిక సేవలు సీఐతో పాటు ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు.

Advertisement

Next Story