గుప్పగూడెం గ్రామంలో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు..

by Sumithra |
గుప్పగూడెం గ్రామంలో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు..
X

దిశ,చింతలమానేపల్లి : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని లంబాడిహెట్టి (గుప్పగూడెం) గ్రామంలోని ప్రధాన రహదారి పై ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. పూర్తిగా కిందికి ఉండడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చేయి ఎత్తితే అందే విధంగా ఉండడంతో కనీసం పాఠశాలకు వచ్చే స్కూల్ బస్సు కూడా వచ్చే పరిస్థితి లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ మార్గం గుండా గ్రామస్తులు, రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని గ్రామస్తులు సంబందించిన ఏఈ, డీఈ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు.

గ్రామస్తులు ఏమి తోచక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈ విషయాన్ని ఎవరికీ చెప్తే పరిష్కారం అవుతోందని సతమతమవుతున్న సందర్భంలో మండలంలో దిశ పత్రికలో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించి పరిష్కారం అవుతున్న విషయాన్ని గ్రామస్తులు గమనించి శనివారం దిశ పత్రికకు సంప్రదించారు. దిశ పత్రిక ద్వారా మా సమస్యను పరిష్కారం అవుతుందని నమ్మకంతో గుప్ప గూడెం గ్రామస్తులు తెలియజేస్తున్నామన్నారు. విద్యుత్ అధికారులు వెంటనే విద్యుత్ తీగలని సరిచేసి గ్రామస్తులకు ఎలాంటి అపాయం జరగకుండా చూడాలన్నారు. ఈ విషయమై సంబంధిత శాఖ ఏఈ రవీందర్ ని దిశ సంప్రదించగా..త్వరలోనే స్తంభాన్ని ఏర్పాటు చేసి కిందకు ఉన్న వైర్లను సరి చేస్తామని సిబ్బందిని వెంటనే పంపిస్తామని తెలిపారు.

Next Story