- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కరువు..
దిశ, ఖానాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని ప్రతిమండల కేంద్రంలో, గ్రామాల్లో కూడా బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారు. కానీ నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని మస్కపూర్ గ్రామసర్పంచ్ ఆడిదెలా మహేందర్, ఉప్పసర్పంచ్ దోనికేని సాగర్ ఆరోపించారు. రోడ్డుప్రమాదంలో గాయాలపాలైన బాధితులను వైద్యం కోసం తీసుకువస్తే బయటకు వెళ్లి ఎక్సరే చేయించుకొని రావాళని అంటున్నారన్నారు.
నియోజకవర్గ పరిధిలో ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఉండి రోగులకు వసతులు కల్పించకపోవడం ఏంటి అని వారు స్థానిక ఆసుపత్రికి సూరింటెండ్ తో, డాక్టర్ వంశీమాధవ్ తో వాగ్వివాదానికి దిగారు. కాగా నెలరోజుల క్రితం నుండి రేడియో గ్రాఫర్, అనస్తేషియా డాక్టర్ లు రావడం లేదని, ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయని డాక్టర్ వంశీమాధవ్ తెలిపారు. జిల్లా అధికారులకు కూడా ఈ విషయం తెలిపామని ఆయన అన్నారు. ఆసుపత్రిలో రేడియోగ్రాఫర్ లేకపోవడంతో బయట నుండి ఎక్స్ రే చేయించుకోమన్నారని స్థానిక డాక్టర్లు తెలిపారు. ఖాలీగా ఉన్న పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారని, రోగులకు ఎప్పుడు అన్ని వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని స్థానికులు వాపోతున్నారు.