విద్యుత్ కోతలకు నిరసనగా సబ్ స్టేషన్ ముట్టడి..

by Sumithra |
విద్యుత్ కోతలకు నిరసనగా సబ్ స్టేషన్ ముట్టడి..
X

దిశ, దిలావర్ పూర్ : దిలావర్ పూర్ సబ్ స్టేషన్ వద్ద అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంటసేపు భారీ ధర్నా నిర్వహించారు. ధర్నా వద్దకు ఇంచార్జ్ ఎస్సై గీతా రాణి ట్రాన్స్ కో ఏఈ వచ్చి రైతులను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు అంగీకరించలేదు. సీఐ, ట్రాన్స్కో డీఈ వచ్చి వీలైనంత మొత్తంలో పగటిపూట విద్యుత్తు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. ట్రాన్స్కో డీఈకి వినతి పత్రం సమర్పించారు. డీసీసీ అధ్యక్షులు ముత్యంరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇన్ని రోజులు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామని మాట ఇచ్చి పంటలు వేసిన తర్వాత ప్రభుత్వం ప్రకటిత కోతలు విధిస్తుందని అన్నారు.

కోతలు విధించడం ద్వారా రైతు వేసిన పంట ఎండిపోతుందని రైతు పెట్టుబడి కూడా నష్టపోతారని ప్రభుత్వం వెంటనే స్పందించి దినంపూట నిరంతరాయంగా విద్యుత్తును ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ రాత్రి పూట విద్యుత్తు ఇచ్చినట్లయితే రైతులకు ఇబ్బంది కలుగుతుందని పాముకాటు, విద్యుత్ షాక్ తో రైతులు చనిపోతున్నారని మాట్లాడి ఇప్పుడు అదే వ్యక్తి పగటిపూట కోత విధించి రాత్రిపూట కరెంటు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జడ్పీటీసీ తక్కల రమణారెడ్డి మాట్లాడుతూ అప్రకటిత విద్యుత్ కోతను విధిస్తున్న ఈ ప్రభుత్వానికి రాబోయే కాలంలో రైతులు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లో గద్దించుతారని రైతులతో పెట్టుకుంటే వారి ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దిలావర్పూర్ సర్పంచ్ వీరేష్ కుమార్ సర్పంచ్ గోవింద్ రెడ్డి, నాయకులు మంద మల్లేష్, రామ్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, రమణ, నర్సారెడ్డి, సందీప్ గౌడ్, పరశురాం పటేల్ పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed