- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
పత్తి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
దిశ, ఆసిఫాబాద్ : ప్రభుత్వ పత్తి కోనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కేవీపీ అగ్రోటెక్, కొండపల్లిలోని గౌరీనాథ్ వైట్ గోల్డ్ జిన్నింగ్ మిల్లుల్లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, జిల్లా మార్కెటింగ్ అధికారి అశోక్ అహ్మద్ లతో కలిసి పత్తి కొనుగోలును ప్రారంభించారు.
పత్తి తేమ 8 శాతం నుంచి 12 శాతం లోపు ఉంటే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర లభిస్తుందని చెప్పారు. రైతులు నిబంధనలు పాటించాలని కోరారు. మిగితా జన్నింగ్ మిల్లులలో కొనుగోలు ప్రక్రియ త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్ లో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, గౌండ్ రత్న అవార్డు గ్రహీత సీడాం అర్జున్ కు కలెక్టర్ ఫండ్ నుంచి 50 వేల రూపాయల విలువగల బ్యాటరీ ట్రై సైకిల్ ను అందజేశారు. టెలికాం సేవల విస్తరణపై పలు టెలికాం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.