- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Koti Deepotsavam: రేపటి నుంచే కోటి దీపోత్సవం.. ఆ వేడుకల్ని చూస్తే పులకించిపోవాల్సిందే
దిశ, వెబ్ డెస్క్: కార్తీకమాసం పేరు చెప్పగానే గుర్తొచ్చేవి.. పూజలు, వ్రతాలు, నోములు, కార్తీక దీపాలు, కోటి దీపోత్సవం. 2012లో భక్తి టీవీ - ఎన్టీవీ చేపట్టిన ఈ కోటిదీపోత్సవాన్ని శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి చేతుల మీదుగా ప్రారంభమైంది. నాటి నుంచి.. ప్రతీ ఏటా కార్తీకమాసంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా.. కోటి దీపోత్సవం 17 రోజుల పాటు.. వైభవంగా, కన్నులపండువగా జరుగుతోంది. ఈ ఏడాది నవంబర్ 9 (శనివారం) నుంచి 25వ తేదీ వరకూ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎన్టీవీ - భక్తిటీవీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.
ఈ 17 రోజులు రోజుకొక కల్యాణం, ప్రవచనాలు, ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, భక్తుల నీరాజనాలతో కోటిదీపోత్సవం జరుగుతుంది. ఆ ఘట్టాలను చూస్తే.. ఎవరికైనా ఒళ్లు పులకించాల్సిందే. ఈ వేడుకలో ప్రముఖ పుణ్యక్షేత్రాల దేవతామూర్తుల్ని చూసి.. భక్త కోటి పులకించిపోతుంది. కేవలం దీపోత్సవమే కాదు.. మహాదేవుడికి జరిగే సహస్ర కలశాభిషేకాన్ని కన్నులారా వీక్షించవచ్చు. శివుడికి స్వయంగా రుద్రాక్షలు, భస్మంతో అభిషేకం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తుండటం విశేషం. శివకేశవులను కోటిదీపాల మధ్య దర్శించుకునే మహా యోగం కలుగుతుందంటే అతిశయోక్తి కాదు. ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటల నుంచి ఈ క్రతువు మొదలుకానుండగా.. ఈ వేడుకలో పాల్గొనేందుకు భక్తులు ఎదురుచూస్తున్నారు.