- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం..
దిశ, కాగజ్ నగర్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అంద్వల్లి పెద్దవాగుపై కూలిపోయిన బ్రిడ్జ్ నిర్మాణ పనులు వెంటనే చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కే శ్రీనివాస్ అన్నారు. బుధవారం పెద్దవాగుపై కూలిపోయిన బ్రిడ్జి శకలాలను ఆయన పరిశీలించారు. ఒకసారి బ్రిడ్జి నిర్మిస్తే కనీసం 50 సంవత్సరాలు పైబడి మన్నిక ఉంటుందని అన్నారు. కానీ ప్రస్తుతం అలాగే గతంలో ఉన్న పాలకుల నాసిరకం నిర్మాణ పనుల వల్ల ఈరోజు దహేగాం మండలంతో పాటు అనేక మండలాలకు ప్రజారవాణా స్తంభించిపోయి, నానా అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
వెంటనే తెలంగాణ ప్రభుత్వం పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదని అన్నారు. ప్రజల ఇబ్బందులకు ఎమ్మెల్యే కోనప్ప బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ధోని శ్రీశైలం, చనకపురి గణపతి, గోలెం వెంకటేష్, మాచర్ల శ్రీనివాస్, పర్వత్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.