కాసిపేట మండలం లో చైన్ స్నాచింగ్

by Disha Web Desk 11 |
కాసిపేట మండలం లో చైన్ స్నాచింగ్
X

దిశ, కాసిపేట : నిద్రిస్తున్న మహిళ మెడలోంచి మంగళ సూత్రాన్ని లాకెళ్లిన ఘటన ఆదివారం కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలలోకి వెళితే... కాసిపేట మండలంలోని లంబడి తండా గ్రామానికి చెందిన సత్తవ్వ రాత్రి తన ఇంటి ముందు వరండాలో నిద్రిస్తుండగా తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగుడు సత్తవ్వ మెడలోని మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటన స్థలాన్ని ఏసీపీ రవి కుమార్,శశిధర్ రెడ్డి పరిశీలించారు. పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.



Next Story

Most Viewed