- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'పోడు భూముల సమస్య కోసం జైలుకెళ్ళిన కుటుంబం మాది'
దిశ, బెజ్జూర్ : ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎన్నికల్లో ఆదరిస్తే మరింత సేవ చేస్తారని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూముల సమస్య కోసం తమ కుటుంబం జైలుకెళ్ళిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నంబర్వన్ లో ఉన్నాయన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని రోడ్లు అభివృద్ధి చేశానని, మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
సీఎం కేసీఆర్ హయాంలో సిర్పూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఓడినా, గెలిచినా ప్రజల వెంటే ఉంటానని తెలిపారు. మరిన్ని గ్రామాల్లో అభివృద్ధి చేసినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మాయమాటలు చెప్పి నాయకులను నమ్మవద్దని తెలిపారు. మూడుసార్లు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుపొందాలని, తన వంతు అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలో తునిగాకు రాయల్టీ డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. ప్రభుత్వపరంగా పొడు భూములకు పట్టాలిస్తామని తెలిపారు. బీసీలకు అండగా ఉంటానని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని తెలిపారు. పేదలకు త్వరలో ఇండ్లు ఇస్తామని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
బీజేపీ నాయకులు అధికారంలో ఉన్నరాష్ట్రాల్లో చేయని అభివృద్ధి తెలంగాణలో ఎలా చేస్తారని ప్రశ్నించారు. అనంతరం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆపద్బాంధవుడని, పేద ప్రజలను ఆదుకోవడంలో ముందు వరుసలో ఉన్నారన్నారు. గిరిజనులకు గిరి వికాస్ ప్రభుత్వం అందరికీ వర్తింపజేయాలని కోరిన ఎమ్మెల్యే కోనప్ప అన్నారు. పొడు భూముల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కోనేరు కుటుంబం అభినందనీయమన్నారు. కోనేరు కోనప్ప కుటుంబం కొవ్వొత్తి లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్ ఎంపీపీలు రోజా రమణి, దుబ్బల నానయ్య, జెడ్పీటీసీ పుష్పలత, రైతుబంధు జిల్లా అధ్యక్షులు కొండ్ర జగ్గా గౌడ్, బీఆర్ఎస్ అధ్యక్షులు సిడంసకారం, పీఎస్సీఎస్ చైర్మన్ ఓం ప్రకాష్, మండల ఆప్షన్ సభ్యులు బసరత్ ఖాన్, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు బీఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.