- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Adilabad Collector : అర్జీలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మండలాలు గ్రామాల వారీగా వచ్చి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని ఇచ్చిన అర్జీలను అధికారులు పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి అర్జీదారుని అర్జీలను అక్కడికక్కడే పరిష్కారమయ్యేలా వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ ప్రజావాణి లో పెన్షన్, స్కూల్ అడ్మిషన్, ఆశావర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని, సంజయ్ నగర్ నుండి భట్టి సావర్ గాం కు రోడ్డు వేయాలని, తదితర ఆయా శాఖలకు సంబంధించిన దరఖాస్తులు అధికారులకు ఇస్తూ తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
రాంనగర్ కు చెందిన దివ్యాంగులు శ్రీధర్ తనకు ఉపాధి కల్పించాలని కోరగా వెంటనే మహిళా శక్తి ద్వారా చేపడుతున్న కార్యక్రమంలో తనకు బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించి ఏదైనా ఉపాధి కల్పించాలని డి ఆర్ డి ఓ సాయన్న ను ఆదేశించారు. గత వారం వరకు ఉన్న ఆయా శాఖలకు సంబంధించిన పెండింగ్ వివరాలు తెలుపుతూ వచ్చే వారం లోగా వాటిని పరిష్కరించాలని, ప్రజావాణి పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. ఈ ప్రజావాణి లో ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్ మాల్ వీయ,ఆర్డీవో లు వినోద్ కుమార్, జివాకర్ రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.