- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: భైంసాలో టెన్షన.. టెన్షన్.. అడుగడుగునా పోలీసులే...!
దిశ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా (Nirmal district) భైంసా(Bhainsa)లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈ రోజు గణేశ్ నిమజ్జనాల సందర్భంగా పట్ణణంలో అడుగడుగునా పోలీసు భద్రత (Police Security) ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల దృష్ట్యా పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. భైంసాలో భారీగా మోహరించారు. గడ్డెన్న ప్రాజెక్టు వాగు (Gaddenna Project Vagu) వద్ద గణేశ్ నిమజ్జనాలకు అనుమతించారు. దీంతో 600 మంది పోలీసులతో భద్రత చర్యలు పర్యవేక్షిస్తున్నారు. భైంసాలో దాదాపు 130 గణేశ్ మండపాల నుంచి నిమజ్జనాల కోసం వచ్చే అవకాశం ఉండటంలో మరింత నిఘా ఏర్పాటు చేశారు. భైంసా పట్టణం నుంచి గణేశ్ నిమజ్జనాల (Ganesha Nimajjanam) ప్రాంతం వరకూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ప్రతిక్షణం భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగించాలని భైంసా ప్రజలకు విజ్ఞప్తిగా చేశారు.