ఆదిలాబాద్.. ఉట్నూర్ ఐటీడీఏ ఆఫీస్ ముందు ఉద్రిక్తత

by Mahesh |
ఆదిలాబాద్.. ఉట్నూర్ ఐటీడీఏ ఆఫీస్ ముందు ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆదివాసీల రిజర్వేషన్ లో 11 కులాలను కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులు ఆందోళన చేపట్టారు. భారీ సంఖ్యలో ఐటీడీఏ వద్దకు చేరుకున్న ఆదివాసీలు ఆఫీస్ పై రాళ్ల దాడి చేశారు. అలాగే ఐటీడీఏ ఆఫీస్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆదివాసీలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed