ప్రభత్వ భూములు అక్రమిస్తే చర్యలు తప్పవు : అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

by Sumithra |
ప్రభత్వ భూములు అక్రమిస్తే చర్యలు తప్పవు : అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
X

దిశ, తాండూర్ : జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ భూములను అక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. తాండూర్ మండలం రేచిని రోడ్డు రైల్వే స్టేషన్ వద్ద గల ప్రభుత్వ భూమిని శుక్రవారం ఆయన పరిశీలించారు.

ప్రభుత్వ భూమిలో వేసిన పెన్సింగ్ ను రెవెన్యూ సిబ్బంది తొలగించి ప్రభుత్వ భూమి అని బోర్డ్ పెట్టారు. అదనపు కలెక్టర్ వెంట తాండూర్ తహసిల్దార్ కవిత, ఆర్ఐ ఎజాజుద్దీన్, కార్యదర్శి తపాస్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed