షాపింగ్ మాల్ వారి వినూత్న ప్రచారం.. కంగు తిన్న కస్టమర్స్..

by Sumithra |
షాపింగ్ మాల్ వారి వినూత్న ప్రచారం.. కంగు తిన్న కస్టమర్స్..
X

దిశ, మంచిర్యాల టౌన్ : పాలప్యాకెట్ పై పాలకు సంబంధించిన డీటైల్స్ కనిపించకుండా షాపింగ్ మాల్ ఆఫర్స్ తో ఉన్న స్టిక్కర్ లను చూసి జనాలు కంగుతిన్న ఘటన మంచిర్యాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాలలోని అతిపెద్ద షాపింగ్ మాల్ తమషాప్ లో పెట్టిన ఆఫర్స్ ని పబ్లిసిటీ చేసేందుకు కొత్త రకమైన ప్రయోగాన్ని చేశారు. అందులో బాగంగానే ప్రతిరోజు మంచిర్యాలకు వచ్చే కరీంనగర్ డైరీ పాలప్యాకెట్ సప్లై ఏజెంట్ లతో కుమ్మక్కై 1 లిటర్ ప్యాకెట్ కు రూపాయి చొప్పున వెచ్చించి పాలప్యాకెట్ కు వెనుకాల అంటించి వాటిని పట్టణంలో ఉండే అన్ని చిన్నచిన్న షాప్ లకు సప్లై చేశారు.

ఆ షాప్ లో పాలప్యాకెట్ కొన్న వినియోగదారులు అదిచూసి షాక్ అయ్యారు. పాలకు సంబంధించిన క్వాంటిటీ, ఎక్స్పైరీ డేట్, ప్రొడక్ట్ డీటైల్స్ కనిపించక పోవడంతో పలువురు దుకానదారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల ప్యాకెట్ ను క్వాలిటీ డీటైల్స్ చూసుకోకుండా ఎలా తీసుకునేది అని ప్రశ్నించారు. ఇది చూసిన పలువురు పాల ప్యాకెట్ ల నిర్వాహకులు కరీంనగర్ డైలీ పాల సంస్థకు ఫోన్ చేసి ప్రశ్నించగా మాకు తెలియకుండా జరిగింది. మా అనుమతి లేకుండా అక్కడి ఏజెంట్ లు అల చేశారని, ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూస్తామని బదులు ఇచ్చారు.

Advertisement

Next Story