- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమే దీనికి కారణమా..
దిశ, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం నుంచి మహారాష్ట్ర - తెలంగాణతో కలిపే అంతర్రాష్ట్ర జాతీయ రహదారి గుంతలమయంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహారాష్ట్ర- తెలంగాణను కలిపే అంతరాష్ట్ర జాతీయ రహదారి పై ప్రతిరోజూ వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి రహదారి ప్రయాణానికి అనుకూలంగా లేకుండా గుంతలుగా మారి ప్రమాదాలకు నిలువుగా ఏర్పడింది.
అంతర్రాష్ట్ర జాతీయ రహదారి ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండల కేంద్రం ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారి ఇప్పుడు పెద్ద పెద్ద గుంతలతో దర్శనమిస్తూ ప్రమాదాలకు నిలువుటద్దంగా మారింది. గత ఎండాకాలం అధిక లోడుతో ఎక్కువ సంఖ్యలో అంతరాష్ట్ర జాతీయ రహదారిపై ఇసుక లారీలు ఇసుక రవాణాను కొనసాగించాయి. దీని కారణంగా అంతరాష్ట్ర జాతీయ రహదారి చాలాచోట్ల పెద్ద పెద్ద గాడులు ఏర్పడి చిన్న చిన్న వాహనాలతో ప్రయాణించేటప్పుడు కుదువులకు లోనవుతూ అదుపుతప్పుతున్నాయి.
ఇది సరిపోదు అన్నట్టు గత రెండు నెలలుగా పడుతున్న వర్షాల వల్ల అంతరాష్ట్ర జాతీయ రహదారిపై తారు కొట్టుకుపోయి ఎక్కడ చూసినా గుంతలు ఏర్పడి ప్రయాణాన్ని ప్రమాదకరంగా మారుస్తున్నాయి. ఇచ్చోడ మండల పరిధిలో వాహనదారుల నరకయాతన ఇచ్చోడ మండల కేంద్రం ఎప్పుడూ రద్దీగా ఉండే జాతీయ రహదారి. ఇప్పుడు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణం కష్టంగా మారినా, గత రెండు నెలలుగా వర్షాల ప్రభావంతో పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడినా వాటిని పూర్తి చేసే మరమ్మతు పనులు చేసేవారే లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు.
జాతీయ రహదారిపై మరమ్మత్తుల నిర్లక్ష్యం జాతీయ రహదారి పై ఆడేగామ కే, పిప్పిరి, కోలారి, గ్రామల వద్ద వాహనదారులకు నరకయాతనే. రహదారి మరమ్మతులను నిర్లక్ష్యం చేస్తూ చాలా చోట్ల లోతుగా గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తరచూ మొరపెట్టుకున్నా అధికారుల విషయానికొస్తే నిమ్మ కు నిరీతనట్టుగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు విమర్శిస్తున్నారు.
టెండర్లు జరిగినా ఫలితం శూన్యం 2018లో 80,00,000లకు మంజూరు అయ్యిన ఇప్పటివరకు రోడ్డు పనులు ప్రారంభం కాకపోతే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ టెండర్ కి పిలవాల్సిన సమయం వచ్చిన కూడా ఇప్పటివరకు రోడ్డును పట్టించుకునే నాధుడు లేడు. ఈ సంవత్సరం మళ్లీ మూడు కోట్ల 60 లక్షలతో నూతనంగా రోడ్డుకు టెండర్ అయితుందని ప్రజా ప్రతినిధులు తెలియజేయడం గమనార్హం.
ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమే మూలం
మండల ప్రజలను నియోజకవర్గంలోని వాహనదారులను మభ్యపెట్టడంలో ప్రజా ప్రతినిధుల పాత్ర ఎంతగానో ఉన్నట్లు కనబడుతుంది. వాహనదారుల చలానాల విషయానికి వస్తే ఇష్టానుసారంగా జరిమానాలు వేసే ప్రభుత్వం రోడ్డు విషయానికి వస్తే పరిస్థితిని పట్టించుకోదా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.