- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్..
దిశ, దిలావర్పూర్ : దిలావర్పూర్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా దిలావర్పూర్ ఎస్సై గంగాధర్ పట్టుకున్నారు. భద్రాచలం నుండి నాందేడ్ వెళ్తున్న హోండా సిటీ కార్ నెంబర్ AP 09BB 0459 నంబర్ గల కారు నిర్మల్ నుండి నాందేడ్ వైపు వెళుతున్న సమయంలో అత్యంత రహస్య సమాచారం మేరకు టోల్ ప్లాజా వద్ద ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి కొంత దూరంలో కారు నిలిపించారు. అందులోంచి ఏ3 నిందితుడైన రౌఫ్ అనే వ్యక్తి కారులోంచి దిగి పారిపోయాడు. ఇది గమనించినటువంటి పోలీసులు కారు దగ్గరికి వెళ్లి తనిఖీ చేయగా స్టెప్ని ప్రదేశంలో గంజాయి స్మగ్లింగ్ చేయడానికి బండిలోపల చిన్న బాక్స్ వలే వెల్డింగ్ చేయించి పోలీసులకు ఎటువంటి అనుమానం రాకుండా తయారు చేయించారు.
అది గమనించిన ఎస్సై డిక్కీ పరిమాణం చిన్నగా కనిపించడంతో అనుమానం వచ్చి దారిని పగలగొట్టాడు. అందులో 26 ప్యాకెట్లలో లభించాయి. దిలావర్పూర్ తహసిల్దార్ కరిముల్లా ఎస్సై ఎం.గంగాధర్ లు పంచుల సమక్షంలో పంచనామ నిర్వహించి 26 ప్యాకెట్లు గల గంజాయి 90 కిలోలు, 18 లక్షల రూపాయలు విలువ గలదిగా గుర్తించారు. నిందితుల వద్ద నుండి హోండా సిటీ కార్ తో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దిలావర్పూర్ పోలీస్ స్టేషన్లో నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
హైదరాబాద్ ప్రాంతానికి చెందిన షేక్ ఆరిఫ్, ఎండీ అన్వర్, రౌఫ్ ముగ్గురు స్నేహితులు. షేక్ అరీఫ్ రౌఫ్ లు గతంలో గంజాయి స్మగ్నం చేస్తూ పట్టుబడి చంచల్ గూడా జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అబ్దుల్, అమ్రిత్ లు భద్రాచలంలో గంజాయి అమ్ముతున్నారని తెలిసి ప్రత్యేకంగా తయారు చేసుకున్నటువంటి కారులో అక్కడనుండి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రలోని నాందేడ్ లో విక్రయించవచ్చని ముగ్గురు గంజాయి తీసుకుని వెళ్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడిన ఈ ముగ్గురు 3,60,000 రూపాయల విలువకు కొనుగోలు చేసి దీనిని కిలో కు 20,000 రూపాయల విలువకు అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.