అర్కగూడ ప్రాజెక్టులో పడి పశువుల కాపరి మృతి

by Sumithra |
అర్కగూడ ప్రాజెక్టులో పడి పశువుల కాపరి మృతి
X

దిశ, చింతలమానేపల్లి : మండలంలోని బాబాసాగర్ అర్కగూడ ప్రాజెక్టులో బాబాసాగర్ గ్రామానికి చెందిన పిప్పిరె బాబురావు (48) అనే పశువుల కాపరి గల్లంతయిన విషయం తెలిసిందే. శుక్రవారం మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై విజయ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం గేదెలను మేపేందుకు ప్రాజెక్టు వద్దకు వెళ్లి గేదెలను దాటించే క్రమంలో గేదె తోకను పట్టుకొని దాటే క్రమంలో ఒక్కసారిగా నీట మునుగడంతో మృతి చెందాడని, శుక్రవారం గజ ఈతగాళ్ళ సాయంతో మృతదేహన్ని బయటకు తీయించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడు భార్య లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story