జయశంకర్ సాహిత్య పురస్కారానికి డాక్టర్ ఎన్ గోపి ఎంపిక

by Javid Pasha |
జయశంకర్ సాహిత్య పురస్కారానికి డాక్టర్ ఎన్ గోపి ఎంపిక
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారానికి యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఆచార్య ఎన్ గోపి ఎంపికయ్యారు. సాహిత్యంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సాహితీ మూర్తులకు భారత జాగృతి ఈ అవార్డు అందజేస్తున్నారు. అవార్డును ఈ ఏడాది ప్రారంభం అవుతుండగా తొలి అవార్డును ఎన్ గోపి అందుకుంటున్నారు. గోపి ఇప్పటికీ 56 పుస్తకాలు రచించగా అందులో 26 కవితా సంకలనాలు, 7 వ్యాస సంకలనాలు, 5 అనువాదాలు కాగా మిగతావి ఇతరాలు ఉన్నాయి.

వారి రచనలు అన్ని భారతీయ భాషలలోకి అనువాదం అవడంతో పాటు జర్మన్, పర్షియన్, రష్యన్ వంటి భాషలలోకి అనువాదం అయ్యాయి. తెలుగు యూనివర్సిటీకి వీసీగా వ్యవహరించడంతో పాటు కాకతీయ, ద్రవిడ యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీ గా పని చేశారు. ఈ నెల 21 అబిడ్స్ లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో జరిగే కార్యక్రమంలో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తో పాటు ముఖ్యులు అవార్డు ప్రదానం చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed