నిందితుడికి కఠిన శిక్ష విధించాలి : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

by M.Rajitha |
నిందితుడికి కఠిన శిక్ష విధించాలి : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏజెన్సీ ప్రాంతంలోకి బంగ్లాదేశ్ రోహింగ్యాలు చొరబడి అక్రమంగా నివసిస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారే ఆదివాసీలపై దాడులకు తెగబడుతున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ మహిళలకు రక్షణ లేకుండాపోయిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. గాంధీ ఆస్పత్రిలో జైనూరు అత్యాచార బాధితురాలిని ఆయన గురువారం పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవో, డాక్టర్లతో మాట్లాడి బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన పరీక్షలు చేసి, మెరుగైన చికిత్స అందించాలని, వైద్యులకు సూచించారు. అనంతరం ఏలేటి మాట్లాడుతూ.. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని వివరించారు. సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే వరుసగా ఆదివాసీలపై అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని ఏలేటి పేర్కొన్నారు. జైనూరు అత్యాచార బాధితురాలికి న్యాయం జరిగే వరకూ బీజేపీ అండగా ఉంటుందన్నారు. బాధితురాలిపై దాడి జరిగిందని, అత్యాచారం జరగలేదని మంత్రి సీతక్క చెప్పడం దారుణమని, ఆదివాసులకు మంత్రి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జైనూర్ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని నిందితుడిని శిక్షించాలని ఏలేటి పట్టుపట్టారు. పరామర్శించేందుకు వెళ్లే బీజేపీ ఎమ్మెల్యేలను, నాయకులను హౌజ్ అరెస్ట్ చేయడం సరికాదని ఏలేటి మండిపడ్డారు.

Next Story

Most Viewed