TS: ముగిసిన టీచర్ ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం

by GSrikanth |
TS: ముగిసిన టీచర్ ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల గడువు గురువారంతో ముగిసింది. మొత్తం 21 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27 వరకు గడువు ఉంది. మార్చి 13వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో ఈ ఎన్నిక హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

Next Story