- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వి !
దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ తరఫున గెలిచిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.కేశవరావు గత నెల 31న తన పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరగనున్నది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. దేశం మొత్తం మీద 9 రాష్ట్రాల్లోని 12 ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఆ ప్రకారం తెలంగాణలోని ఒక స్థానానికి సెప్టెంబర్ 3న పోలింగ్ జరగనున్నది. ఈ స్థానానికి సీనియర్ న్యాయవాది, మాజీ ఎంపీ అభిషేక్ మను సింఘ్విని ఏఐసీసీ నిలబెట్టనున్నట్లు ఢిల్లీలోని కాంగ్రెస్ వర్గాల సమాచారం. కేశవరావు రాజీనామా చేసిన సమయంలోనే సింఘ్వి పేరు వినిపించగా ఇప్పటికీ అదే వైఖరి కొనసాగుతున్నట్లు ఆ వర్గాలు నొక్కి చెప్పాయి. ఉప ఎన్నిక కోసం నామినేషన్లు ఈ నెల 14న ప్రారంభం కానున్నందున అప్పటి వరకు సీఎం రేవంత్ విదేశీ టూర్ ముగించుకుని హైదరాబాద్ వస్తారు. అప్పుడు మరింత స్పష్టత వచ్చే అవకాశమున్నది.
సంఖ్యా బలం రిత్యా.. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయం
ఉప ఎన్నికలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం రీత్యా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని చెప్పొచ్చు. తెలంగాణ నుంచి ఈ ఒక్క స్థానం భర్తీ అవుతున్నందున సొంత రాష్ట్రానికి చెందిన అభ్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఉత్తరాది రాష్ట్రానికి చెందిన వ్యక్తిని నిలబెట్టడంపై గాంధీభవన్‌లో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ఏఐసీసీ కోటా కింద సింఘ్వి పేరు ఖరారవుతున్నందున అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని ఓపెన్‌గా వ్యతిరేకించే అవకాశాలు లేవు. సీనియర్ నేతలు ఉన్నందున వారికి అవకాశం దొరుకుతుందని భావించినా హైకమాండ్ నిర్ణయం ఫైనల్ కానుండడంతో ఎవరూ నోరు మెదపని పరిస్థితి ఉన్నది. సీఎం రేవంత్ విదేశీ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత అభ్యర్థి పేరుపై మరింత స్పష్టత రానున్నది.