Aadi Srinivas: కిషన్ రెడ్డి శాపనార్థాలు సరికాదు: ఆది శ్రీనివాస్

by Prasad Jukanti |
Aadi Srinivas: కిషన్ రెడ్డి శాపనార్థాలు సరికాదు: ఆది శ్రీనివాస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పాటనే కిషన్ రెడ్డి పాడుతున్నారని ఆది శ్రీనివాస్ (Adi Srinivas) విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ (Davos Tour) పర్యటనపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) చేసిన వ్యాఖ్యలకు శనివారం ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. పెట్టుబడులను చూసి కిషన్ రెడ్డి గర్వించాల్సింది పోయి శాపనార్ధాలు పెట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. కిషన్ రెడ్డికి చేతనైతే తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు తేవాలన్నారు. పేదలకు ఉపయోగపడే ఒక్క పథకమైనా బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఆ నలుగురికి దోచిపెడితే బీజేపీ ప్రభుత్వం ఓ ఇద్దరికి దోచిపెడుతోందని ఆరోపించారు. కాగా నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడి వారినే దావోస్ తీసుకువెళ్లి అక్కడ ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. దావోస్ పెట్టుబడులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా వాస్తవరూపం దాల్చాలని అన్నారు.


👉 Read Disha Special stories


Next Story