రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ సెల్ టవర్ ఎక్కిన యువకుడు

by Sathputhe Rajesh |
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ సెల్ టవర్ ఎక్కిన యువకుడు
X

దిశ, గుమ్మడిదల : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన గుమ్మడిదల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుమ్మడిదల గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన అన్వర్ అనే వ్యక్తి శుక్రవారం రోజు ఉదయం బీఎస్ఎన్ఎల్ ఆఫీస్‌లోని టవర్‌పైకి ఎక్కి నిరసనకు దిగాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు మూడు ఎకరాల భూమిని వెంటనే తనకు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థానిక నాయకులు పోలీసులు కిందికి దిగాలని ఎన్నిసార్లు నచ్చచెప్పిన వినకపోవడంతో స్వయంగా జడ్పీటీసీ కుమార్ గౌడ్ సగం వరకు టవర్ ఎక్కి యువకుడితో మాట్లాడి నచ్చజెప్పి కిందికి తీసుకొని వచ్చారు. అనంతరం యువకుడు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వచ్చి 9 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు తమ బ్రతుకులు ఏమాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలు ఇంటి అద్దలు కట్టలేక నరకయాతన అనుభవిస్తున్నామని వాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సారి గెలిచినప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం.. వెంటనే నిరుపేద కుటుంబాలకు మూడు ఎకరాల భూమి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed