- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణలోని ఆ జిల్లాలో మోడీకి యువ మిత్రుడు..ఫోటో విడుదల చేసిన ప్రధాని
దిశ, డైనమిక్ బ్యూరో:సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ విరామం లేకుండా ప్రచారం నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. రెస్ట్ లెస్ గా జర్నీ చేస్తున్న ప్రధాని ఏ మాత్రం ఛాన్స్ దొరికినా చిన్నపిల్లాడిలా మారి వారితో ఇట్టే కలిసిపోతున్నారు. తాజాగా బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్, వరంగల్ లో పర్యటించిన నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ఓ చిన్నారిని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో షేర్ చేస్తూ.. 'వరంగల్ లో ప్రచార ర్యాలీకు వెళ్తుండగా లక్ష్మీపురం గ్రామంలో నా యువ మిత్రుడిని కలిశాను' అంటూ తెలుగులో క్యాప్షన్ ఇచ్చి స్మైలీ ఎమోజ్ జోడించారు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు మోడీ గారు మీకు యంగెస్ట్ క్యూట్ ఫ్రెండ్ ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా నిన్న అహ్మదాబాద్ లో ఓటు వేయడానికి వెళ్తూ అక్కడ ఉన్న ఓ చిన్నారిని ఎత్తుకుని సరదాగా ఆడించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.