HYD: జూబ్లీహిల్స్‌ కార్మికనగర్‌లో తీవ్ర విషాదం

by GSrikanth |
HYD: జూబ్లీహిల్స్‌ కార్మికనగర్‌లో తీవ్ర విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మహిళ మృతిచెందింది. ఈ ఘటన కార్మికనగర్‌లో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నీళ్లు రాకపోవడంతో సంపు మూత తెరిచిన మహిళ.. ప్రమాదవశాత్తు అందులోపడింది. ఆలస్యంగా గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో ఆమెను బయటకు తీశారు. అప్పటికే ఆమె చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story