- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లండన్‌లో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం.. ఎయిర్‌పోర్ట్‌లో సందడి
X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లండన్‌లో ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ జాగృతి సభ్యులు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల చట్టంపై లండన్‌లో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనేందుకు కవిత అక్కడికి వెళ్లారు. బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ ఈ సదస్సును నిర్వహిస్తోంది. మహిళా రిజర్వేషన్ల కోసం కవిత పోరాటం చేయడం, ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేయడంతో ఆమెను ఈ సదస్సుకు ఆహ్వానించారు.
ఈ క్రమంలో సదస్సులో పాల్గొనేందుకు లండన్‌కు కవిత వెళ్లారు. ఇవాళ లండన్‌లోని సెంట్రల్ హాల్‌లో నిర్వహిస్తున్న సదస్సులో కవిత పాల్గొని ప్రసగించనున్నారు. మహిళా రిజర్వేషన్ల ఆవశ్యకత, ప్రజాస్వామ్య ప్రక్రియలో మహళల భాగస్వామ్యం గురించి కవిత మాట్లాడనున్నారు.
Advertisement
Next Story