- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
సీఎం ఇంటివద్ద అనుమానాస్పద సంచి కలకలం
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇంటికి అతి సమీపంలో ఓ అనుమానాస్పద సంచి కలకలం రేపింది. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఓ బ్యాగ్ వదిలివెళ్ళాడు. అనుమానాస్పద బ్యాగ్ ను గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యి.. ఇంటెలిజెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణమే అక్కడికి చేరుకున్న ఇంటెలిజెన్స్ విభాగం ఆ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. దానిని అక్కడి నుండి వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళి, తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ఆ బ్యాగ్ ను వదిలి వెళ్లిన వ్యక్తి గురించి జూబ్లీహిల్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి.. మరో ఎమ్మెల్యే, తెలంగాణ పీఏసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీకి మధ్య తీవ్ర వివాదం జరగడం.. ఆరోజంతా నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే హైటెన్షన్ కొనసాగింది. అప్పటి నుండి పోలీసులు నగరంలో జరిగే అన్ని విషయాలను సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా రాష్ట్ర సీఎం ఇంటివద్ద అనుమానాస్పద సంచి దొరకడం ప్రస్తుతం నగరంలో సంచలనం సృష్టిస్తోంది.