ప్చ్.. నిరుద్యోగ ముఖాముఖిలో నిరుద్యోగులెక్కడ!

by Mahesh |
ప్చ్.. నిరుద్యోగ ముఖాముఖిలో నిరుద్యోగులెక్కడ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తానని చెబుతున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల టీసేవ్ పేరుతో ఓ ఫోరం ఏర్పాటుకు జోరుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ ఫోరం ప్రయత్నం ముందుకు పడుతుందా లేక ఎటు కాకుండా పోతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్న వేళ షర్మిల తీరు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది.

తాజాగా బుధవారం షర్మిల నిరుద్యోగుల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. నిరుద్యోగుల సమస్యలపై పార్టీలన్ని కలిసి రావాలని పిలుపునిచ్చాయి. అయితే షర్మిల నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా పార్టీ నేతలే ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలను కూర్చోబెట్టుకుని నిరుద్యోగులతో ముఖాముఖి అని ప్రచారం చేసుకోవడంపై వైఎస్సార్ టీపీ నేతలే చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story