ఆహా మయూరమా!.. నీ నాట్యం చూడతరమా!!(వీడియో)

by Javid Pasha |   ( Updated:2023-07-25 12:29:11.0  )
ఆహా మయూరమా!.. నీ నాట్యం చూడతరమా!!(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఏ యువతైనా అందంగా డ్యాన్స్ చేస్తే నెమలిలాగా డ్యాన్స్ చేసిందంటూ పొగడుతుంటాం. మరీ అలాంటిదే ఓ నెమలి పురివిప్పి నాట్యమాడితే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కాగా మెదక్ జిల్లా దుబ్బాక మండలం పరశురాం నగర్ లోని అడవి నుంచి గ్రామంలోకి వచ్చిన ఓ నెమలి ప్రకృతి రమణీయతకు పరవశించి పురి విప్పి నాట్యమాడింది. ఆ దృశ్యాన్ని ఓ ప్రకృతి ప్రేమికుడు తన సెల్ ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో వదిలాడు. ఇంకేముంది నెమలి నాట్యం చూసిన ప్రతి ఒక్కరూ ‘ఆహా మయూరమా.. నీ నాట్యం చూడతరమా!’ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story