మెట్టు దిగిన మాజీ ఎంపీ వీహెచ్.. అయినా డీఎస్ యూటర్న్!

by GSrikanth |
మెట్టు దిగిన మాజీ ఎంపీ వీహెచ్.. అయినా డీఎస్ యూటర్న్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గోరు చుట్టు మీద రోకలి పోటు అన్నట్లుగా టీకాంగ్రెస్ పరిస్థితి తయారైంది. అంతర్గత అసమస్యలతో సతమతం అవుతున్న హస్తం పార్టీకి డీఎస్ చేరిక కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతోంది. ఇలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో లేదో అంతలోనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు డి.శ్రీనివాస్ లేఖ రాయడం సంచలనంగా మారింది. దీంతో డీఎస్ ఎపిసోడ్ టీ-కాంగ్రెస్‌లో అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా చాలారోజుల తర్వాత నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టిన కాంగ్రెస్ నేతలు ఒక్క వేదికపైకి వచ్చి డీఎస్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆదివారం గాంధీ భవన్‌కు వచ్చిన డీఎస్ తన కుమారుడు సంజయ్‌తో పాటు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇంతలోనే డీఎస్ అనారోగ్యం కారణంగా యాక్టీవ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారని అందువల్ల కాంగ్రెస్ నేతలు, మీడియా తమ నివాసానికి వచ్చి ఇబ్బంది పెట్టవద్దని డీఎస్ రాజీనామా లేఖను ఆయన సతీమణి విడుదల చేయడం సంచలనంగా మారింది.

మెట్టుదిగినా ఫలితం లేకపాయే!

గతంలో కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన డీఎస్ తెలంగాణ ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత అక్కడ సీఎం కేసీఆర్‌తో విభేదాల కారణం, వయోభారం కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓసారి ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని సైతం కలిసి వచ్చారు. కానీ ఎందుకో పార్టీలో మాత్రం చేరలేకపోయారు. ఈ క్రమంలో డీఎస్ తిరిగి కాంగ్రెస్‌లో చేరాలనే ఆలోచనను వీహెచ్ లాంటి సీనియర్లు వ్యతిరేకించారు. పార్టీ కష్టాల్లో ఉన్ననాడు వదిలేసి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని ఒక వేళ డీఎస్ కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటే తన ఇద్దరు కుమారులను వెంట తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. కానీ అనూహ్యంగా ఆదివారం జరిగిన డీఎస్ పార్టీలో చేరిక కార్యక్రమంలో వీహెచ్ కూడా ఉన్నారు. గతానికి భిన్నంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు సైతం ఆయన రాక సందర్భంగా ఒకే చోట ఉన్నారు. దీంతో తమ మధ్య విభేదాలు పక్కన పెట్టి చేర్చుకున్నా ఇంతలోనే డీఎస్ యూటర్న్ తీసుకోవడం కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారింది.

Advertisement

Next Story

Most Viewed