- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking : హైదరాబద్ లో వివాహిత మిస్సింగ్ కలకలం
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబద్ లో వివాహిత మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లిన భార్య తిరిగి ఇంటికి రాలేదు. దీనితో ఆ మహిళ భర్త పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. బాలకృష్ణ అనే యువకుడికి కృష్ణ ప్రియ అనే యువతితో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా కృష్ణ ప్రియ, బాలకృష్ణ దంపతులు హైదరాబాద్ లోని పుప్పాల గూడలో నివాసం ఉంటున్నారు.
అయితే ఈ రోజు ఉదయం కృష్ణ ప్రియ తన భర్త బాలకృష్ణకు చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళింది. ఇక బాలకృష్ణ ఉద్యోగం నిమిత్తం ఆఫీస్ కి వెళ్లిపోయారు. అయితే మధ్యాహ్నం బాలకృష్ణ తన భార్య కృష్ణప్రియకు ఫోన్ చేశారు. ఎన్ని సార్లు కాల్ చేసిన కృష్ణ ప్రియ ఫోన్ తియ్యలేదు. దీనితో కంగారుపడిన భర్త భార్య ఆచూకీ కోసం చుట్టుపక్కల గాలించారు. అయిన ఫలితం లేకపోయింది. భార్య ఆచూకీ దొరకకపోవడంతో బాలకృష్ణ నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. బాలకృష్ణ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.