ఫస్ట్ డే 77% హాజరు.. రెండు సెషన్లలో సైన్స్ మ్యాథ్స్ పరీక్షలు

by GSrikanth |
ఫస్ట్ డే 77% హాజరు.. రెండు సెషన్లలో సైన్స్ మ్యాథ్స్ పరీక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్) నిర్వహిస్తున్న టెట్-2024 కంప్యూటర్ బేస్ట్ టెస్ట్‌కు తొలి రోజున 77.81% మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 74 కేంద్రాల్లో రెండు సెషన్ల (ఉ. 9.00-11.30, మ. 2.00-4.30 గంటల)లోజరిగిన పరీక్షలకు మొత్తం 26,796 మంది హాజరయ్యారు. పరీక్షలకు మొత్తం 34,436 మంది హాజరుకావాల్సి ఉండగా 7,640 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఫస్ట్ సెషన్‌కు 76.80% మంది, సెకండ్ సెషన్ పరీక్షలకు 79.55% మంది చొప్పున హాజరైనట్లు ఎస్సీఈఆర్టీ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఎలాంటి అవతకవకలకు తావులేకుండా పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం భావించడంతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం స్వయంగా సిటీలోని ఇన్నోవిజన్ టెక్నలాజీస్ సెంటర్‌లో ఏర్పాటైన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఎగ్జామ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు.

ఉదయం జరిగే పరీక్షలకు 4,121 మంది గైర్హాజరైతే సాయంత్రం సెషన్‌కు 3,519 మంది ఆబ్సెంట్ అయినట్లు కన్వీనర్ తెలిపారు. రెండు సెషన్లకు కలిపి సగటున 77.84% మంది హాజరయ్యారని, తొలిరోజు పేపర్ – 2 (సైన్స్, మ్యాథ్స్) పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా జూన్ 2వ తేదీ వరకు కంటిన్యూ కానున్నాయి.

Advertisement

Next Story