- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీల్ చైర్‌లో వచ్చి నామినేషన్ వేసిన మాజీ మంత్రి
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి ప్రముఖ సినీనటుడు బాబు మోహన్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు నామినేషన్ ప్రక్రియ చివరి రోజు కావడంతో వరంగల్ జిల్లా కేంద్రంలోని ఆర్వో కార్యాలయానికి వెళ్లిన ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసే అంతకు ముందు ఆయన కారును కార్యాలయం లోపలికి అనుమతించలేదు. తాను అనార్యోగంతో బాధపడుతున్నానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో ఆయన పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఆయన వీల్ చైర్‌లో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కాగా, బాబు మోహన్ ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరారు. బాబు మోహన్‌తో పాటు వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ సుధీర్, బీజేపీ నుంచి ఆరూరి రమేష్ పోటీ చేస్తున్నారు. దీంతో వరంగల్ పార్లమెంట్ రాజకీయం రసవత్తరంగా మారింది.