- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Fatal Accident: జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: జూబ్లీహిల్స్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాల్యాయి.దీంతో వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి మూల మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు, క్షతగాత్రుడు జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌లో బౌనర్లుగా పని చేస్తున్నట్లు గుర్తించారు. మృతుడు తారక్‌గా ధృవీకరించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతుడికి గత ఏడాదే పెళ్లి అయినట్లు తెలుస్తోంది. నైటంతా పబ్‌లో విధులు నిర్వహించి తెల్లవారుజామున ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక సీసీ టీవీ పుటేజులను పరిశీలించారు. బైకును ఢీకొట్టిన వెంటనే నిందితుడు కారుతో సహా పారి పోయారు. ఈ పుటేజ్‌లో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేసు దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు.
అయితే కారు నడిపినవారు మద్యం తాగి డ్రైవ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ పుటేజ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అటు మృతులు బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా మద్యం మత్తులో ప్రమాదాలకు పాల్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా మద్యం తాగి వాహనాలు డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు రోడ్ రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందేనని సూచించారు. కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలని, తాగి అసలు డ్రైవింగ్ చేయొద్దన్నారు. అతివేగం ఎప్పటికైనా ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు.
హిట్ అండ్ రన్..బౌన్సర్ మృతి( సీసీ ఫుటేజ్ )
— Telugu Scribe (@TeluguScribe) January 24, ౨౦౨౪
జూబ్లీహిల్స్ - బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
వీరిద్దరూ పబ్‌లో బౌన్సర్లుగా పనిచేస్తున్నట్లు… pic.twitter.com/VmX5O1GQtNRead More..
BREAKING: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం