ఇంటి ముందు టెంటు.. టెంటు కింద మిర్చి: ఓ రైతు ఇంట్లో మిర్చి పండుగ..!

by Javid Pasha |
ఇంటి ముందు టెంటు.. టెంటు కింద మిర్చి: ఓ రైతు ఇంట్లో మిర్చి పండుగ..!
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: ఏదైనా పండుగో పబ్బమో వస్తే సాధారణంగా ప్రజలు తమ ఇండ్లల్లో టెంట్ వేస్తుంటారు. అనంతరం బ్యాండ్, డీజేలతో ఫుల్ హంగామా చేస్తుంటారు. మామూలు సందర్భాల్లో టెంటును ఎవరూ ఉపయోగించరు. కానీ మహబూబాబాద్ జిల్లా గుర్రాల గుట్ట తండాకు చెందిన బిచ్చా అనే ఓ మిర్చి రైతు తన రూటే సెపరేట్ అనిపించుకున్నాడు. తనకున్న నాలుగు ఎకరాల్లో మిర్చి సాగు చేయగా.. భారీగా దిగుబడి వచ్చింది. బస్తాల కొద్దీ మిర్చి పండటంతో దాన్ని నిల్వ చేయడానికి ఆయన ఇంట్లో స్థలం సరిపోలేదు.

దీంతో తన ఇంటి ముందు టెంటు వేసి ఆ టెంటు కింద మిర్చిని ఆరబోశాడు. అనంతరం కూలీలతో ఆ మిర్చిని ఏరిస్తున్నాడు. ఈ క్రమంలోనే దిశ రిపోర్టర్ ‘క్లిక్’ మనిపించాడు. కాగా మార్కెట్ లో ప్రస్తుతం మిర్చి ధర క్వింటాల్ కు రూ.25 వేల వరకు ఉండటంతో సదరు రైతు ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. రైతు బిచ్చా ఇంట్లో మిర్చి పండుగ జరుగుతోందని స్థానికులు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story