Vanaparthi: కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

by Gantepaka Srikanth |
Vanaparthi: కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
X

దిశ, గోపాల్ పేట: వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన సాయిరెడ్డి అనే రైతుకు నాలుగు ఎకరాల భూమి ఉంది. అయితే.. ఆ భూమిని సాగు చేయనీయకుండా తన అన్నాదమ్ములు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ గతంలో పలుమార్లు ప్రజావాణిలో విన్నవించుకున్నారు.

అయినా అధికారులు పట్టించుకోవడం లేదని మనస్థాపానికి గురైన రైతు సాయిరెడ్డి వనపర్తి కలెక్టరేట్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రజావాణి కార్యక్రమంలో ఉన్న అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పోలీసులకు చెప్పడంతో..ఆ రైతును చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు సాయిరెడ్డికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఏది ఏమైనా ప్రతి ప్రజావాణిలో భూ సమస్యలపై పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు పేర్కొన్నారు.

Advertisement

Next Story