అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ పై ఏసీబీ సోదాలు

by Sumithra |
అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ పై ఏసీబీ సోదాలు
X

దిశ, మంచిర్యాల : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ లో బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలకు నిత్యం వేలాది వాహనాల నుండి రవాణా శాఖ అధికారులు చేతివాటానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు వాంకిడి చెక్ పోస్ట్ పై ఆకస్మికంగా దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఏఎంవీఐ అధికారిని మాధవిని విచారణ జరిపి లెక్కకు మించిన నగదు రూ.45 వేలను సీజ్ చేసినట్లు సమాచారం. ఒక్కసారిగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడంతో చెక్ పోస్ట్ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed