పోలీసుల విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

by Mahesh |
పోలీసుల విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Former MLA Jeevan Reddy) ఈ రోజు మరోసారి పోలీసుల విచారణ (Police investigation) హాజరయ్యారు. గతంలో భూమి కబ్జా కేసు (Land grabbing case)లో జీవన్ రెడ్డిపై చేవెళ్ల, మోకిల పీఎస్‌లలో కేసు నమోదు అయ్యాయి.ఈ కేసులో మోకిల PS లో జీవన్ రెడ్డి విచారణకు హాజరు కాగా.. పోలీసులు ఆయనను ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. అలాగే మాజీ ఎమ్మేల్యే తన వద్ద ఉన్న భూమి తాలుకా డాక్యుమెంట్‌లను చూపించగా.. పోలీసులు వాటిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే ఇదే కేసులో గతంలో పోలీసుల విచారణకు హాజరైన జీవన్ రెడ్డి.. తాను ఎలాంటి భూమిని కబ్జా చేయలేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు తాను సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని పోలీస్ స్టేషన్‌లో ఇచ్చానని చెప్పుకొచ్చారు. అలాగే పోలీసులు పిలిస్తే విచారణకు హాజరు అవుతానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులు పెట్టి విచారణకు తిప్పుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయిన జీవన్ రెడ్డి ఆరోపించారు.



Next Story

Most Viewed