- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చైనా హ్యూమనాయిడ్ రోబోట్.. ఇంతకీ ఏం పనులు చేస్తుందో తెలుసా..?

దిశ, వెబ్ డెస్క్: చిట్టి రోబో..రోబో సినిమాలో అనేక పనులను చకచకా చేసి చూపిస్తుంది. ఇప్పుడు కూడా అచ్చం అలాంటి రోబోను ఓ కంపెనీ తయారు చేసింది. ఈ రోబో హెయిర్ స్టైలింగ్, హోటల్ సేవలు ,కార్లు పార్కింగ్ వంటి పనులు చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఓ మనిషి వలె..ఇంట్లో అన్ని పనులూ చేసి పెడుతుంది ఈ రోబో. దాని వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
మ్యాజిక ల్యాబ్ కంపెనీ అధునాతన హ్యూమనాయిడ్ రోబోటిక్ తో మరో ముందడుగు వేసింది. ఈ రోబో 1.74 మీటర్ల పొడవుతో ఉంటుందని కంపెని వెల్లడించింది.ఇది హెయిర్ స్టైలింగ్, హోటల్ సేవలు ,కార్లు పార్కింగ్ కార్లు వంటి పనులను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. షాపింగ్ మాల్‌లో కస్టమర్‌లకు చురుకుగా సహాయం చేసే మ్యాజిక ల్యాబ్ సర్వీస్ రోబోట్‌లను ప్రదర్శిస్తుంది. 2025లో 400 హ్యూమనాయిడ్ రోబోట్‌లను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. అలాగే అదనంగా మ్యాజిక్ ల్యాబ్ దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు నావిగేషన్, రోజువారీ పనులలో సహాయం చేయడానికి రూపొందించిన నాలుగు-కాళ్ల రోబోట్‌ను ఆవిష్కరించింది.