రామాయణం చేయడానికి సరైన వ్యక్తి అతనే.. సన్నీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

by Hamsa |
రామాయణం చేయడానికి సరైన వ్యక్తి అతనే.. సన్నీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు సన్నీ డియోల్(Sunny Deol) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాట్’(jatt). ఈ సిపిమాకు గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన సన్నీ డీయోల్ ఈ తెలుగు చిత్రంతో హీరోగా మారుతున్నాడు. ఇందులో రణ్‌దీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్(Vineet Kumar Singh), ఊర్వశి రౌటేలా, రెజినా, సయామి కేర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్స్‌లో రాబోతుంది.

ఈ నేపథ్యంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న సన్నీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ‘రామాయణ’(Ramayana) సినిమాలో హనుమంతు పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించాడు. ‘‘నమిత్ ఎప్పటి నుంచో సినిమాలు చేయాలనుకున్నాడు, ఇప్పుడు అతనికి సరైన సినిమా వచ్చింది, రామాయణం చేయడానికి అతను సరైన వ్యక్తి’’ అన్నారు. ఆ తర్వాత యాంకర్ మేము చాలా ఎక్జైటింగ్‌గా ఉన్నాం. ఇండియా మొత్తంలో ఇదే బెటర్ చాయిల్. ‘రామాయణ’ సినిమాలో హనుమాన్ పాత్ర చేయడం అని అనగా.. నాకూడా తెలియదు.. మీరంతా ఇలా అంటున్నారు.

ఒక నటుడిగా నాకు ఇది సవాలుతో కూడిన పాత్ర కాబట్టి జాగ్రత్తలు వహిస్తాను. ఇలాంటి పాత్రలను నేను ఇష్టపడతాను. అయితే నేను షూటింగ్‌ గురించి చెప్పాలనుకోవడం లేదు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, నితేశ్ తివారి దర్శకత్వంలో రాబోతున్న ‘రామాయణ’ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. ఇక ఇందులో యశ్ రావణుడిగా కనిపించబోతున్నారు. ఈ మూవీని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. అయితే రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.



Next Story

Most Viewed