- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీ బిర్యానీ మొత్తం వెయ్యి అయింది.. ఆస్పత్రి బిల్లు లక్ష..! భోజనం వికటించి 8 మందికి అస్వస్థత
దిశ, డైనమిక్ బ్యూరో/షాద్‌నగర్: వంట వండుకోడానికి టైమ్ లేదని, బయట రుచికరమైన ఫుడ్ దొరుకుతుండటంతో తిన్నారంటే ఇంకా అంతే సంగతులు అన్నట్లు ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడైన విషయం తెలిసిందే.. అయినా ఇంకా చాలా మంది హోటల్ ఘుమఘుమలకు అలవాటు పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. మ్యారేజ్ డే సందర్భంగా ఫ్యామిలీతో కలిసి వెళ్లి తింటే ‘బిర్యానీ బిల్లు వెయ్యి అయింది.. ఆస్పత్రి బిల్లు లక్ష’ అన్నట్లుగా తయారైంది. రంగారెడ్డి జిల్లా షాద్‌గర్‌లోని ఓ మండీ హోటల్‌లో దారుణం జరిగింది.
భోజనం వికటించి 8 మందికి అస్వస్థత
భోజనం వికటించి 8 మందికి అస్వస్థతకు గురైరయ్యారు. షాద్‌నగర్ మండలంలో ఓ గ్రామానికి చెందిన కావలి నరేందర్, మంగమ్మ పెళ్లిరోజు ఈ నెల 22న కావడంతో కుటుంబసభ్యులతో కలిసి మండీ హోటల్‌కు వెళ్లారు. అక్కడ వారు తమకు ఇష్టమైన ఫుడ్ తిన్నారు. ఆపై ఇంటికి చేరిన తర్వాత నరేందర్ రక్తంతో కూడిన వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం కూడా ఒక్కరొక్కరుగా 8 మంది ఆస్పత్రిలో చేరారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఫుడ్ సేఫ్టీ మెరుపుదాడులు కంటిన్యూ
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇక్కడి కొన్ని హోటళ్లలో దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. ఓ హోటల్‌లో ఫంగస్ పట్టిన ఐస్ క్రీమ్, సింథటిక్ కలర్లు వాడుతున్న ఫుడ్ మెటీరియల్‌ను గుర్తించారు. ఆ కలర్లు వాడిన 8 కిలోల బిర్యానీ, 10 కిలోల మండీ రైస్‌ను బయటపడేశారు. వంటగదిలో దుర్వాసన, మురుగు నీరు పేరుకుపోయినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే హోటల్‌కు నోటీసులు జారీ చేశారు.