వరదలతో ఇరిగేషన్ శాఖకు 500 కోట్ల నష్టం :మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |
వరదలతో ఇరిగేషన్ శాఖకు 500 కోట్ల నష్టం :మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా రూ.10,300 కోట్ల మేర ఆస్తి నష్టం నష్టం జరిగిందని, ఇరిగేషన్ శాఖకు 500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. జిల్లాలోని నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు 132 కిలోమీటర్ వద్ద గండి పడిన ప్రాంతంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను మంత్రి పరిశీలించారు. ఎడమ కాలువ గండి పూడ్చివేతకు రాష్ట్ర ప్రభుత్వం 2.10 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరు చేసిందన్నారు. మరమ్మత్తు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి పగలు పనిచేసి గండి పూడ్చే విధంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు.

ప్రకృతి విపత్తుల కారణంగా జరిగిన నష్టంపై కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించిందని మంత్రి తెలిపారు. కేంద్ర సహాయం కోసం వేచి చూడకుండా... యుద్ధ ప్రాతిపదికను పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. కేంద్ర సాయం సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 773 చోట్ల చెరువులు, కాల్వలు తెగిపోవడం, పంప్ హౌజ్ లు మునిపోవడంతో రూ.500 కోట్ల నష్టం జరిగిందన్నారు. వచ్చే వారంలోగా వాటి మరమ్మత్తు పనులు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించామని చెప్పారు. కోదాడ, హుజుర్ నగర్ నియోజకవర్గంలలో తెగిపోయిన చెరువులు, కాలువల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఇళ్లు కూలిపోయిన బాధితులకు ఇందిరమ్మ పథకంలో భాగంగా నూతనంగా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. వరదల్లో మృతి చెందిన బాధిత కుంటుంబలకు ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లిస్తోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed