- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
food poisoning: 50 మంది హాస్టల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. పరిస్థితి విషమం
దిశ వెబ్ డెస్క్: బాగా చదువుకుని భవిష్యత్‌లో ఉన్నత శికరాలకు ఎదగాలని ఎందరో విద్యార్థుల ఉన్న ఊరికి, కన్నవారికి దూరమై హాస్టల్స్‌లో ఉండి చదువుకుంటూ ఉంటారు. అయితే కొన్ని హాస్టల్స్‌లో నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణికి ఆశయాల బాటలో అడుగులు వేయాల్సిన విద్యార్థులు అనారోగ్యంతో అసుపత్రుల పాలవుతున్నారు. కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లేకపోవడంతో విద్యార్థులకు ఫుడ్ ఫాయిజన్ అయిన ఘటనలు గతంలో కోకొల్లు.
తాజాగా అలాంటి ఘటనే చందానగర్‌లోని సుమన్ హాస్టల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చందానగర్‌లోని మహిళా దక్షిత సమితి బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు చందానగర్‌లోని సుమన్ హాస్టల్ ఉంటూ చదువుకుంటున్నారు. తాజాగా హాస్టల్‌లోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. 50 మందికి వాంతులు, విరోచనాలు కాగా స్థానిక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నట్టు సమాచారం. కాగా వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.