- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Reservations:గుడ్ న్యూస్.. ఉన్నత విద్యాసంస్థల్లో వారికి 5 శాతం రిజర్వేషన్లు

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగులకు (Persons with Disabilities) 5 శాతం రిజర్వేషన్లు (5 percent Reservations) కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్థల్లో ఆయా వర్గాల ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితిలోనూ 5 ఏళ్ల మినహాయింపు కల్పించింది. దివ్యాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల మేరకు ఉన్నత విద్యాశాఖ (Higher Education) కార్యదర్శి యోగితారాణా (Yogitarana) ఉత్తర్వులు జారీ చేశారు. దివ్యాంగులను మొత్తం ఐదు కేటగిరీలుగా విభజించి ఒక్కో కేటగిరీ వైకల్యానికి ఒక్కో శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు. దృష్టి లోపం-ఏ కేటగిరి, వినికిడి లోపం, మూగ- బీ కేటగిరి, అంగవైకల్యం-సీ, మానసిక వైకల్యం-డీ, ఒకటికి మించిన వైకల్యాలు-ఈ కేటగిరీలుగా విభజించారు. ఈ ఈ రిజర్వేషన్లు రొటేషన్ పద్దతిలో కొనసాగనున్నాయి. ఒక కేటగిరిలో అర్హులైన అభ్యర్థులు లేకుంటే ఆ రిజర్వేషన్‌ను తదుపరి కేటగిరి అభ్యర్థులకు వర్తింపజేస్తారు. ప్రవేశాల్లో అసలు దివ్యాంగులైన అభ్యర్థులే లేకుంటే ఆ ఖాళీలను సంబంధిత రిజర్వుడు (ఎస్సీ, ఎస్సీ, బీసీ) వర్గాల్లోని సాధారణ అభ్యర్థులతో మెరిట్ ప్రకారం ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.