నల్లగొండలో కాంగ్రెస్ ప్రభంజనం.. గెలిచిన ప్రతి స్థానంలో 40 వేలకు పైగా మెజార్టీ

by Mahesh |
నల్లగొండలో కాంగ్రెస్ ప్రభంజనం.. గెలిచిన ప్రతి స్థానంలో 40 వేలకు పైగా మెజార్టీ
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం వైపు అడుగులు వేస్తుంది. ఈ ఎన్నికల్లో మొదటి నుంచి నల్గొండ పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పోటెత్తిన ఓటర్లు ఉమ్మడి జిల్లాలోని 12 సీట్లకు గాను 11 సీట్లను కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. అలాగే ఈ జిల్లాలో దేవరకొండ, భువనగిరి మినహా.. విజయం సాధించిన ప్రతి అభ్యర్థి 40 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించడం విశేషం. కాగా ఉమ్మడి జిల్లాల్లో నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల విరేశం.. ఏకంగా 68,839 ఓట్ల తేడాతో విజయం సాధించి.. ఉమ్మడి జిల్లాలో ఇంతవరకు ఎవరు సాధించిన మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించారు.

ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ సాధించిన మెజారిటీ

1.నకిరేకల్ నియోజకవర్గం..

బిఆర్ఎస్ :64701

కాంగ్రెస్ :133540

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య పై

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం 68,839 ఓట్లతో గెలుపు

2. మునుగోడు నియోజకవర్గం :

బీఆర్ఎస్ :79034

కాంగ్రెస్ :119624

బి ఆర్ ఎస్ అబ్యర్ధి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై

కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 40590 మెజారిటీ

3. మిర్యాలగూడ నియోజకవర్గం

బీఆర్ఎస్ : 65680

కాంగ్రెస్ :114462

బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు పై

కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి 48782 మెజారిటీ

4. నాగార్జునసాగర్ నియోజకవర్గం

బిఆర్ఎస్ : 63982

కాంగ్రెస్ : 119831

బీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ పై కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జై వీర్ రెడ్డి 55849 ఓట్లతో గెలుపు

5. దేవరకొండ నియోజకవర్గం

బిఆర్ఎస్ : 80509

కాంగ్రెస్ : 109663

బీఆర్ ఎస్ అభ్యర్థి రవీంద్ర కుమార్ నాయక్ పై కాంగ్రెస్ అభ్యర్థి బాలు నాయక్ 30021 ఓట్లో విజయం

6. నల్గొండ నియోజకవర్గం

బీఆర్ఎస్ : 53073

కాంగ్రెస్ : 1,07405

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి పై

కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 54,332 ఓట్లతో ఘన విజయం.

౭. కోదాడ నియోజకవర్గం

బిఆర్ఎస్ :45116

కాంగ్రెస్ :77493

బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ పై

కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి 58,172 లీడ్. (12 రౌండ్ లో 12/19)

8. హుజూర్నగర్ నియోజకవర్గం..

బిఆర్ఎస్ : 71819

కాంగ్రెస్ :116707

టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పై కాంగ్రెస్ అభ్యర్థి నల్ల మాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి 44888 గెలుపు.

9. తుంగతుర్తి నియోజకవర్గం

బీఆర్ఎస్ : 78441

కాంగ్రెస్ : 129535

బి బీఆర్ఎస్ అభ్యర్థి గాధరి కిషోర్ కుమార్ పై

కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేల్

51094 ఓట్ల తేడాతో విజయం.

10. భువనగిరి నియోజకవర్గం..

బిఆర్ఎస్ : 76542

కాంగ్రెస్ : 102742

టిఆర్ఎస్ అభ్యర్థి పళ్ల శేఖర్ రెడ్డి పై కాంగ్రెస్ అభ్యర్థి

కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనీల్ కుమార్ రెడ్డి 26201 ఓట్లతో విజయం.

11. ఆలేరు నియోజకవర్గం..

బిఆర్ఎస్ :64507

కాంగ్రెస్ :109360

టిఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పై కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య 49636 మెజారిటీ

Advertisement

Next Story

Most Viewed