బీసీలకు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి : ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్

by Shiva |   ( Updated:2023-09-16 16:13:34.0  )
బీసీలకు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి : ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : 33 శాతం రిజర్వేషన్లను బీసీలకు, మహిళలకు అమలు చేయాలని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్ కుమార్ కేంద్రానికి డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో దేశ జనాభాలో సగం ఉన్న బీసీలకు రిజర్వేషన్లు, మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఎంపీలంతా కేంద్రాన్ని ప్రశ్నించనున్నట్లు వారు వెల్లడించారు. అదే విధంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

దేశానికి బీసీ ప్రధాని వచ్చిన తర్వాతైనా బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశించినప్పటికీ నెరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ గణన అంశాలను కోర్టుకు సమర్పించామని చేతులు దులుపేసుకున్నారని ఆరోపించారు. బీసీల కోసం పోరాటం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించిందని, బీసీల సంక్షేమం కోసం జరుగపోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీబ్ల్యూసీ సమావేశాలు జరపకుండా హైదరాబాద్ కు కాంగ్రెస్ నేతలు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో శాంతిభద్రతల దృష్ట్యా సమావేశం నిర్వహించారని అన్నారు. రాజకీయ అక్కసుతో మాత్రం ఇక్కడకి రావద్దని సూచించారు. పొలిటికల్ వ్యూహంతో కాకుండా ఒక స్టడీ టూర్ లో భాగంగా రావాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed