- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్తగా 3 ఫుడ్ టెస్టింగ్.. 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు : మంత్రి దామోదర రాజనర్సింహ
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలకు ప్రాధాన్యతనిస్తూ కొత్తగా మరో మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్(food testing labs) లను వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఏర్పాటు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ(Damodara Rajanarsimha) వెల్లడించారు. అలాగే కొత్తగా 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ తీసుకొస్తున్నామని, ఇందుకోసం ఇప్పటికే వాహనాల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ఆధునీకరిస్తున్నామని, సంవత్సరానికి కనీసం 24 వేల ఫుడ్ శాంపిల్స్ టెస్ట్ చేసేలా ల్యాబులను ఆధునీకరిస్తామని ప్రకటించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వెంగళరావు నగర్‌లో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు (fssai) లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను మంత్రి దామోదర రాజ నర్సింహ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండొద్దన్నారు. పెరిగిన హోటళ్ల సంఖ్య, జనాభాకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్యను పెంచబోతున్నామని, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం కలెక్టరేట్లలోనే స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
హోటళ్ల యజమాన్యాలు సరియైన పద్ధతిలో వ్యాపారం చేసుకోవాలని, ఫుడ్ హైజీన్, ఎన్విరాన్‌మెంట్ హైజీన్ మెయింటేయిన్ చేయాలని స్పష్టం చేశారు. నియమాలను పాటిస్తూ బిజినెస్ చేసుకునేవారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తప్పు చేస్తే ఎవ్వరినీ వదిలిపెట్టమని, హాస్టళ్లలో పిల్లలకు మంచి భోజనం పెట్టనివారిని కూడా తప్పకుండా శిక్షిస్తామని చెప్పారు. హైదరాబాద్ అంటే బిర్యానీకి, మంచి ఫుడ్‌కి ఫేమస్ అని, ఆ పేరును విశ్వవ్యాప్తం చేసేలా హోటల్ ఇండస్ట్రీ, స్ట్రీట్ ఫుడ్ ఇండస్ట్రీ ఉండాలన్నారు. ప్రతి హోటల్‌ను, రెస్టారెంట్‌ను, స్ట్రీట్ సైడ్ ఫుడ్ స్టాల్స్‌ను, డైట్ క్యాంటీన్లను అధికారులు తనిఖీలు చేస్తారని తెలిపారు. మనం హైదరాబాదీలం, భోజన ప్రియులమని, మంచి భోజనం దొరుకుతుందంటే, నాలుగైదు కిలోమీటర్ల దూరమైనా వెళ్లి తింటామన్నారు. కానీ, కొంత గిరాకీ పెరగగానే, ఆ హోటల్‌లో ఫుడ్ నాణ్యత తగ్గుతోందనా, అలా ఉండకూడదని, బ్రాండును కాపాడుకోవాలని, క్వాలిటీ, హైజీన్ మెయింటేయిన్ చేయాలని హితవు పలికారు.