- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా సంగతేంటి?.. 2008 డీఎస్సీ క్లియర్.. తెరపైకి 1998 ఇష్యూ
దిశ, డైనమిక్ బ్యూరో:2008 డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ వీరిని మినిమం పే స్కేల్ తో కాంట్రాక్ట్ పద్దతిలో నియమించేందుకు ఆమోదం తెలిపింది. అయితే 2008 డీఎస్సీ అభ్యర్థుల సమస్యను పరిష్కరించేలా కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో 1998 డీఎస్సీ ఇష్యూ తెరపైకి వస్తోంది. 2008 డీఎస్సీ క్వాలిపైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తున్నట్లుగానే రెండు దశాబ్దాలకుపైగా ఎదురు చూస్తున్న తమ కల సాకారం చేయాలని 1998 డీఎస్సీ అర్హులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు 1998 డీఎస్సీ క్వాలిపైడ్ అసోసియేషన్ రేపు మధ్యాహ్నం 1 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహిస్తోంది.
1998 డీఎస్సీ ఇష్యూ ఏంటి?:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం 1998లో మెగా డీఎస్సీ నిర్వహించింది. ఆ సమయంలో అభ్యర్థులకు కటాఫ్ మార్కులకు సంబంధించి రిజర్వేషన్లు కూడా కేటాయించింది. అందులో ఓసీలకు 50, బీసీలకు 45, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 మార్కులను కటాఫ్ గా పేర్కొంటూ 221 జీవో జారీ చేసింది. అయితే కొన్ని విభాగాల్లో కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు లేకపోవడంతో ఓసీలకు 45, బీసీలకు 40, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 35 మార్కులకు కటాఫ్ స్కోర్ తగ్గిస్తూ 618 పేరుతో మరో జీవో విడుదల చేసింది. అయితే ఆ సమయంలో ఉప ఎన్నికలు రావడంతో కొన్ని జిల్లాల్లో నియామక ప్రక్రియ వాయిదా పడింది. ఎన్నికలు జరిగిన అనంతరం ఇంటర్వ్యూలకు పిలిచారు. అయితే ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేయడంతో గందరగోళం మొదలైంది. అదే సమయంలో ఉప ఎన్నికలు రావడంతో కొన్ని జిల్లాల్లో నియామక ప్రక్రియ వాయిదావేసి తర్వాత మళ్లీ చేపట్టారు.
అయితే ఒకే సారి రెండు జీవోలు అమలు చేయడం వల్ల తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయనేది వివాదంగా మారింది. కటాఫ్ మార్కులు తగ్గించడాన్ని కొందరు అభ్యర్థులు ఏపీ పరిపాలన ట్రైబ్యునల్ నుఆశ్రయించగా నియామక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కటాఫ్ మార్కులు తగ్గించడాన్ని ట్రైబ్యునల్ 2009లో తప్పుపట్టింది. 20211లో హైకోర్టు సైతం ఇదే నిర్ణయాన్ని సమర్ధించింది. ఈ ఇష్యుపై హైకోర్టు, సుప్రీంకోర్టులో దశాబ్దాలుగా వేర్వేరు కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీలో జగన్ ప్రభుత్వం 2022లో కాంట్రాక్ట్ బేసిస్ లో ఉద్యోగాలు కల్పించారు. తెలంగాణలోనూ తమకు న్యాయం చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కేబినెట్ ఇటీవల 2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్దతిలో నియామకం చేపట్టాలని నిర్ణయించడంతో తమకూ న్యాయం జరిగేలా చూడాలని 1998 డీఎస్సీ అభ్యర్థులు కోరుతున్నారు.