- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెన్త్ రిజల్ట్స్ విడుదల.. ఆ 25 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలే!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ విడుదల అయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. అయితే, ఈ ఫలితాల్లో రాష్ట్రంలోని 25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడం గమనార్హం. దీంతో ఈ 25 స్కూళ్ల తీరు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక, ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 86.60 శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు తెలిపారు.
బాలుర 84.68 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలది 88.53 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు అయినట్లు తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. ఇక, 2793 స్కూళ్లో వంద శాతం ఉత్తీర్ణణ నమోదైనట్లు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 99 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు కాగా.. వికారాబాద్ జిల్లాలో అత్యల్పంగా 59.46 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు అయినట్లు తెలిపారు. ఫలితాలను ప్రభుత్వ అధికారిక సైట్ http://results.bse.telangana.gov.in లేదా http://results.bsetelangana.org వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఫలితాల్లో ఏదైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకు రావాలని సూచించారు.