TS: పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్

by GSrikanth |
TS: పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి పరీక్ష ఫీజు గడువును పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7వ తేదీ వరకు చెల్లింపులకు అవకాశం కల్పించారు. కాగా, రూ.50 ఆలస్య రుసుముతో ఈనెల 14వ తేదీ వరకు ఛాన్స్ ఇచ్చారు. రూ.200 లేట్ ఫీజుతో ఈనెల 21వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ వరకు చెల్లింపులకు అవకాశమిచ్చారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సూచించారు. ఇతర వివరాలకు www.bse.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు. ఇదిలా ఉండగా మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed